కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ
కుత్బుల్లాపూర్ అక్టోబర్ 2 (సూర్యోదయం) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ జీతయ్య, నాయకులు బండల వెంకటేష్, తిరుమలేష్, మల్లేష్, శివ గుప్తా, మరియు స్థానిక నాయకులు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం గ్రామంలో యూత్ సభ్యుల వారు ఏర్పాటు చేసిన దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శరణ్య ఫర్నిషింగ్స్ షాపును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Recent Comments