
కుత్బుల్లాపూర్ అక్టోబర్ 2 (సూర్యోదయం)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద భారతదేశ స్వాతంత్ర్య సారథి మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు..అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..మహాత్మ గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలను సమాజనికి పరిచయం చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ గాంధీ అని కొనియాడారు.. జాతిపిత, ప్రపంచ శాంతి మహారాథుడు మహాత్మ గాంధీ అని అన్నారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జయరాం, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బొబ్బ రంగారావు, సిహెచ్ బుచ్చిరెడ్డి, చాంద్ పాషా, కృష్ణ యాదవ్, చౌడా శ్రీనివాస్, నాగేల్ల శ్రీనివాస్, కాజా భాయ్, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, రాజిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అభిరామ్, గణేష్ జ, జితేందర్, సాయి గౌడ్ మరియు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు..

Recent Comments